టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు విష్ణు గురించి పరిచయం అవసరం లేదు.అయితే మంచు విష్ణుకు నలుగురు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే.
ఇక మంచు విష్ణు మొదటి సంతానంగా కవల ఆడపిల్లలు జన్మించారు.వీరికి అరియానా, వివియానా అని నామకరణం చేశారు.
ఇక మంచు విష్ణు ఎప్పటికప్పుడు తన కుటుంబంతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొంటూ ఉంటారు.
ఇకపోతే విష్ణు కుమార్తెలిద్దరూ కూడా ఇదివరకే ఈయన నటించిన జిన్నా సినిమాలో అద్భుతమైన పాటను ఆలపించి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇకపోతే నేడు అరియానా, వివియానా ఇద్దరూ కూడా పుట్టినరోజు జరుపుకోవడంతో మంచు విష్ణు తన కూతుర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే మంచు విష్ణు తన ఇద్దరి కుమార్తెల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లిటిల్ మూమెంట్స్ అరి , వివి.ఐ లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్.’ అంటూ లవ్లీ మెసేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కుమార్తెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈయన చేసిన పోస్ట్ అలాగే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానుల సైతం మంచు విష్ణు కుమార్తెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







