హైదరాబాద్లోని పబ్స్పై మరోసారి పోలీసులు కేసులు నమోదు చేశారు.తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అమ్నీషియా, ఇన్సోమ్నియా పబ్ లపై దాడులు నిర్వహించారు.
పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసినట్లు సమాచారం.రాత్రి 11 గంటలు దాటినా భారీ సౌండ్ తో డీజే ప్లే చేస్తున్నట్లు గుర్తించారు.
రాత్రి 10 గంటల తర్వాత పబ్బుల్లో డీజే వద్దని హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అదేవిధంగా మైనర్లను పబ్ లోకి అనుమతించవద్దని తెలిపింది.
అయితే న్యాయస్థానం ఆదేశాలను పక్కన పెట్టిన రెండు పబ్ లపై దాడులు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.







