కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రష్మిక అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ భాషలలో సినిమా అవకాశాలు అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు.
ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్ లో సందడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే నటించగా మరొక హీరోయిన్ పాత్రలో శ్రీ లీలా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం రష్మిక ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇలా స్పెషల్ సాంగ్ కోసం ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.అయితే ఇప్పటివరకు ఎవరు కూడా స్పెషల్ సాంగ్ కోసం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు.ఇలా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటే ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోయిన్ గా రష్మిక అలాంటి ఘనత సొంతం చేసుకుంటుందని చెప్పాలి.ఇకపోతే రష్మిక ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న వరిసు సినిమాలో నటిస్తున్నారు.
త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.







