Chiranjeevi: చిరు కొత్త సినిమాల ప్రారంభానికి వెనకాడుతున్నాడు.. కారణం అదేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.వచ్చే సంక్రాంతి కి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

 Why Chiranjeevi Not Starting New Films Details, Acharya, Bhola Shankar, Chiranje-TeluguStop.com

అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.ఇదే సమయం లో భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతోంది.

వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఆ సినిమా ను విడుదల చేయబోతున్నారు.ఈ రెండు సినిమా లు కాకుండా మరో మూడు నాలుగు సినిమాలకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి.

కానీ ఆ సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ప్రారంభం కావడం లేదు.ఆచార్య దెబ్బ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అనే ఆలోచనకు మెగాస్టార్ చిరంజీవి స్వస్తి చెప్పినట్లుగా తెలుస్తోంది.

గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అయినప్పటికీ వెంట వెంటనే సినిమా లు చేసి తన సినిమాల సంఖ్య పెంచుకోవాలని మెగాస్టార్ చిరంజీవి భావించడం లేదట.అందుకే మెల్లగా సినిమాలు చేయాలని కథల ఎంపిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నాడు.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, God, Telugu, Top-Movie

అందుకే ఒకటికి రెండు సార్లు కథలు విని వాటికి మార్పులు చేర్పులు చేయించి ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నాడని తెలుస్తుంది.అందుకే కొత్త సినిమాలకు కాస్త సమయం పడుతుందనే ప్రచారం జరుగుతోంది.చిరంజీవి సినిమా ల యొక్క విడుదల తేదీ ల విషయమై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.వచ్చే సంవత్సరం రెండు మూడు సినిమాలు అయినా విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెండు సినిమా లు కన్ఫర్మ్ అయ్యాయి.మరో సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube