మనిషి బేసిగ్గా ప్రకృతికి ప్రేమికుడు.ఎందుకంటే మనం ఈ ప్రకృతిలోని భాగమే కదా.
మనలో అనేక మందికి ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం ఉంటుంది.రాష్ట్రాలు, దేశాలు తిరిగి వాటి అందాలను తిలకించడానికి ప్రయత్నిస్తూ వుంటారు.
కనీసం నెల రోజులకు ఒక్కసారైనా టూర్ చెక్కేస్తూ వుంటారు.ఈ క్రమంలోనే మనిషి ప్రపంచంలోని వున్న కొన్ని అందమైన ప్రదేశాలను కనుగొన్నాడు.
వాటిని ఒక్కసారైనా జీవితంలో చూడాలి అని చెబుతారు ఈ ఔత్సాహికులు.ఇంకా వాటిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు అని ఊరిస్తూ వుంటారు.మరి అలాంటి సిటీల గురించి తెలుసుకుందామా?

‘హకోన్‘ పేరు విన్నారా? ఇది జపాన్లో కలదు.షింటో మందిరాలకు పెట్టింది పేరు.ఎంతో అందమైన పర్వతాలు వాటి మధ్యలో ఉంది.ఈ ప్రదేశం ఒక్కసారైన చూడాల్సందే అని చెబుతారు.అలాగే ‘మతేరా‘ పేరు వున్నారా? ఇది ఇటలీలో ఉంది.పురాతన అద్భుత అందాలకు ఇటలీ 3వ స్థానంలో ఉందని మీకు తెలిసినదే కదా.అలాగే ‘బుడాపెస్ట్‘ గురించి వినే వుంటారు.హంగేరీ దేశంలో ఉండే బుడాపెస్ట్ ఎంతో అందమైన ప్రఖ్యాతి గాంచిన సిటీ.

ఆర్కిటెక్చర్ కి పెట్టింది పేరు బుడాపెస్ట్.అందుకే ఒక్కసారి ఫారీన్ ట్రిప్ వేయాలనుకుంటే మీరూ ఈ ప్రదేశాన్ని తిలకించండి.ఇక ప్యారిస్ గురించి వినని వారు వుండరు.ఇక్కడి అందమైన లేన్స్ ఎంతో సుందరంగా ఉంటాయి.అందుకే ప్యారిస్ ట్రిప్ ఎక్కువ శాతం మంది వెళ్లడానికి ఇష్టపడతారు.ఇక రోమ్ నగరం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.
ఇక్కడి ల్యాండ్ మార్ల్క్ ఇప్పటికే ప్రఖ్యాతి పొందినవి.శ్రీనగర్.
సిటీ గురించి తెలుసు కదా.చెరువులు, వెడ్జ్స్, హిమాలయాస్ ఇవన్ని కలగల్పి ఉన్న ప్రదేశం శ్రీనగర్.వెనిస్.అందాలను ఎపుడైనా చూసారా? ప్రకాశవంతమైన బిల్డ్సింగ్స్, పురాతన కాలంనాటి కోటలు చూడాల్సిందే.‘తలిన్’ ఈస్టోనియాలోని చిన్న ప్రదేశం.వర్క్ ఫ్రం హోం ఇష్టపడేవారికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది.
ఇంకా మనకి తెలియనివి చాలానే వున్నాయి.







