నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ ను ఓ ఫంక్షన్ కలిశా.అతనితో వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేదని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.
తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.సీబీఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానన్నారు.
తాను ఎక్కడికి వెళ్లలేదన్న ఆయన హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఫోనులో అందుబాటులో లేనని, ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో అరెస్ట్ చేశారని ప్రచారం చేశారని వెల్లడించారు.
శ్రీనివాస్ చేసే వ్యవహారాలతో తనకేమి సంబంధమని ప్రశ్నించారు.కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నోటీసులు ఇచ్చినా.ఛార్జిషీట్ పెట్టినా నిజం నిలకడపై తెలుస్తుందని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.