KCR KTR :మునుగోడు కి నేడు కేటీఆర్ ! ఆ హామీల సంగతేంటి ?

నేడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం లో పర్యటించనున్నారు.ఈ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది .

 Today Ktr To Munugoda  What About Those Guarantees , Munugodu Asembly Constency,-TeluguStop.com

ఎందుకంటే ఈ మధ్యనే జరిగిన మునుగోడు అసెంబ్లీ ఓపెనికల ప్రచార సమయంలో కేటీఆర్, కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి ఎన్నో వరాలు ప్రకటించారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, పూర్తిగా తాను అభివృద్ధి చేస్తానంటూ కేటీఆర్ సైతం హామీలు ఇచ్చారు.కేవలం కేటీఆర్ మాత్రమే కాదు, మునుగోడు ఉప ఎన్నికలకు ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, మండలాల వారీగా గ్రామాల వారీగా అనేక హామీలు ఇచ్చారు.

అంతేగదు స్వయంగా సీఎం కేసీఆర్ మునుగోడలు టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామంటూ హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచార సమయంలో చుండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని , 100 పడుకల ఆసుపత్రి మంజూరు చేస్తానని , మునుగోడును దత్తత తీసుకుని సిరిసిల్ల, గజ్వేల్ ,సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానంటూ కేటీఆర్ హామీ ఇచ్చారు.

అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుండూరు మున్సిపాలిటీ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అలాగే మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఈ హామీల అమలకు కెసిఆర్ మంత్రుల కమిటీని నియమించారు.ఆ కమిటీలో మంత్రులు కేటీఆర్,  జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,  ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ ఉన్నారు.

అయితే నేడు మంత్రులకు బృందం మునుగోడు కు 11 గంటలకు చేరుకుని మధ్యాహ్నం ఒంటిగంట వరకు మునుగోడు అభివృద్ధిపై రివ్యూ ను నిర్వహించబోతున్నారు.మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ప్రగతిభవన్ కు చేరుకుని ఈ సమావేశంలో అభివృద్ధి పనులు పూర్తికి ఏం చేయాలనే దానిపైన చర్చించనున్నారు.

దీనిపై కేసీఆర్ కు నివేదిక అందించనున్నారు.

Telugu Munugoduasembly, Telangana-Political

వాస్తవంగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన 15 రోజుల్లోనే చుండూరు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.కానీ హామీ గడువు దాటినా, ఇంకా దానికి సంబంధించిన జీవో విడుదల కాలేదు.దీంతో మిగతా హామీల సంగతి ఏమిటి ? కెసిఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారనే విషయంపై మునుగోడు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube