Pradeep Ranganathan Love today : 'లవ్ టుడే' టైటిల్ తనది కాదట.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

లేటెస్ట్ గా పాపులర్ అయిన యంగ్ డైరెక్టర్లలో లవ్ టుడే డైరెక్టర్ ఒకరు.ఆ డైరెక్టర్ మరెవరో కాదు.

 Pradeep Ranganathan Post Viral On Social Media , Director Pradeep Ranganathan, T-TeluguStop.com

ప్రదీప్ రంగనాథన్.ఈ డైరెక్టర్ తీసింది రెండు సినిమాలే అయినా డిమాండ్ బాగా ఏర్పడింది.

తమిళ్ లో తెలుగులో ఒకేసారి పాపులర్ అయ్యాడు.తమిళ్ లో ”కోమలి” అనే సినిమాతో ప్రదీప్ రంగనాథన్ కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

జయం రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా మంచి విజయం సాధించింది.ఇక ఈ సినిమా వచ్చిన మూడేళ్ళ తర్వాత ”లవ్ టుడే” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లవ్ టుడే కూడా కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది.ఈ సినిమా 5 కోట్లతో తెరకెక్కగా 70 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

దీంతి ఈ సినిమాను దిల్ రాజు తెలుగులోకి తీసుకు వచ్చాడు.తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

లవ్ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా మాత్రమే కాకుండా కథానాయకుడిగా కూడా నటించాడు.రెండు సినిమాలు మంచి ఇవ్వడంతో అతడికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది.

దీంతో తమిళ్, తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయట.

Telugu Kollywood, Tamil, Tollywood-Movie

ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ అందుకుని దూసుకు పోతున్న నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ కమ్ హీరో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఇంతకీ ఈ డైరెక్టర్ ఏం పోస్ట్ చేసాడంటే.లవ్ టుడే టైటిల్ పెట్టే ప్రాసెస్ లో నేను దాన్ని క్రియేట్ చేసిన ఒకరికి థాంక్స్ చెప్పడం మర్చిపోయాను అని వారు 1997లోనే ఈ లవ్ టుడే అనే టైం లెస్ టైటిల్ ను క్రియేట్ చేసారని.

ఆ డైరెక్టర్ బాలశేఖరన్ గారు అని ఇలాంటి టైటిల్ ను ఇచ్చినందుకు వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈయన పోస్ట్ చేసాడు.దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube