Venkaiah Naidu: వెంకయ్య నాయుడి పరోక్షంగా రాజకీయం.. ఆసక్తికరంగా వ్యాఖ్యలు!

గత ఐదేళ్ల పాటు దేశంలోనే రెండో అత్యున్నత పదివిలో కొనసాగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తన రాజకీయ జీవితాన్ని హఠాత్తుగా ముగించుకోవాల్సి వచ్చింది,  ఇటీవలే పదివి కాలాన్ని ముగించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న వెంకయ్య నాయుడుపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి.

 Venkaiah Naidu To Comment On Politics But No Re Entry Details, M Venkaiah Naidu,-TeluguStop.com

అయితే ఈ విషయంపై వెంకయ్య నాయుడు ఖడిస్తునే ఉన్నారు.ఒక్కవేళ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన భారతీయ జనతా పార్టీ ద్వారానే రాజకీయం చేయాల్పి ఉంటుంది.

అవమానకరంగా ఆయనను క్రియశీలక రాజకీయాలు తప్పించిన ఆ పార్టీ నుండి రాజకీయం చేయడం వెంకయ్య నాయుడు ససేమిరా ఒప్పుకోరు. పైగా భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత, మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం. 

చిన్న పాటి పదవులను ఆశించడం తన హోదాకు తగదని వెంకయ్య నాయుడు భావిస్తున్నారు.తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు  క్రియాశీల రాజకీయాల్లోకి రాను, రాజకీయ పార్టీల్లో జోక్యం చేసుకోనప్పటికీ రాజకీయాలపై తప్పకుండా మాట్లాడతానన్నారు.

 దేశానికి జాతీయ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు అవసరమని పేర్కొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలు, భాష, విద్య, చట్టం, లింగ సమస్యలతో సహా పలు అంశాలపై ప్రజల్లోకి వెళ్లి వారికి జ్ఞానోదయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Telugu Legislature, Venkaiah, Rajya Sabha, Venkaiah Active, Venkayya, Visakhapat

రాజకీయాలను నేరపూరితం చేయడంపై వెంకయ్య విచారం వ్యక్తం చేశారు.“దేశ రాజకీయాల్లో నేర నేపథ్యం ఉన్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర, కేంద్ర చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీనియర్ నేత కోరారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించే సమయం ఆసన్నమైందన్నారు.

దేశ న్యాయవ్యవస్థలో కూడా మార్పులు రావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. లిటిషన్లను ఏళ్ల తరబడి లాగడం సరికాదని, కేసుల సత్వర పరిష్కారానికి న్యాయస్థానాలు పద్దతులు పాటించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube