Rajamouli Hit 2: హిట్ టీమ్ కు జక్కన్న సూపర్ సజెషన్.. ప్రతీ ఏడాది ఒక ప్రాంచైజ్ చేయండంటూ..

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈయన సినిమాల్లో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.

 Director Rajamoli Suggestion To Hit Movie Team Details, Director Rajamouli, Hit-TeluguStop.com

ఇప్పటికే నాని తన సొంత బ్యానర్ స్టార్ట్ చేసి కొన్ని సినిమాలను నిర్మించాడు.ఇక ఈయన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.

విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.

ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.

ఈ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు హిట్ 2 తెరకెక్కించాడు.అయితే ఈసారి హీరోగా విలక్షణ హీరో అడవిశేష్ నటిస్తున్నాడు.

ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

దీంతో ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకు బాగానే ప్రొమోషన్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర చేయడంలో టీమ్ అంతా సఫలం అయ్యింది.

Telugu Adivi Sesh, Rajamouli, Pre, Franchise, Nani, Shailesh Kolanu, Vishwak Sen

ఇక తాజాగా హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఈ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు.ఇక్కడ ఈయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.హిట్ ఒక సినిమాగా కాకుండా ఒక ఫ్రాంచైజీలా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్ ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పారు.అలాగే ఈ సందర్భంగా ఒక అదిరిపోయే సలహా కూడా ఇచ్చారు.హిట్ ప్రాంచైజీగా హిట్టు 34 వస్తాయి కానీ ప్రతీ సంవత్సరం ఇదే సీజన్ లో హిట్ వస్తుంది అనేలా ప్లాన్ చేయండి.

ఒకే రోజు లేదా ఒకే వారం ప్రతీ ఏడాది ఒక హిట్ ప్రాంచైజీ వచ్చేలా చేయండి అంటూ సలహా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube