టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ గురించి అందరికీ సుపరిచితమే.తన పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం ఫాతిమా షహయాజ్ ల వివాహం అన్వయ కన్వెన్షన్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక ఆలీ కుమార్తె వివాహానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మెగాస్టార్ చిరంజీవి నాగార్జున దంపతులతో పాటు రాజశేఖర్ దంపతులు ఊహ, రోషన్ అల్లు అరవింద్, రాఘవేంద్రరావు వంటి ఎంతోమంది దర్శకనిర్మాతలు హాజరయ్యారు.
ఇక ఆలీ కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నాయకులూ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.ఇలా సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఆలీ కుమార్తె వేడుకలు పూర్తి అయ్యాయి.ఈ క్రమంలోనే ఆలీ సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె వివాహానికి వచ్చినటువంటి సినీ రాజకీయ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.తన ఆహ్వానాన్ని మన్నించి తన కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.