యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డీజే టిల్లు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి నటి అనుపమ పరమేశ్వరన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఫైనల్ అవడంతో శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించాలని భావించారు.
అయితే ఉన్నఫలంగా ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితులలో మేకర్స్ మరొక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి మడోన్నా సెబాస్టియన్‌ను తీసుకునే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే చిత్ర బృందం ఈమెను కలిసి సంప్రదించగా ఈమె ఈ సినిమాలో నటించడానికి సానుకూలంగా వ్యవహరించారని తెలుస్తుంది.

ఇక ప్రేమమ్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా డీజే టిల్లు సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకోవడంతో రంగంలోకి ప్రేమమ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారు.త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రాబోతుందని సమాచారం.
అయితే డీజె టిల్లు సీక్వెల్ చిత్రంలో ముందుగా సిద్దు జొన్నలగడ్డ సరసన నటి శ్రీ లీల నటించబోతుందని వార్తలు వచ్చాయి.అయితే ఈమెకు తన డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో పూర్తిగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ కాగా చివరికి ఈమె కూడా తప్పుకున్నారు.అయితే ఈమె వెళ్లిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.







