హైదరాబాద్ లోని దక్కన్ కిచెన్ హోటల్ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిర్వాహకుడు నందకుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు.
చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.నిన్న సుమారు ఐదున్నర గంటల పాటు నందకుమార్ ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
హోటల్ ఆర్థిక లావాదేవీలు, లీజు అగ్రిమెంట్ అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.అయితే నందకుమార్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.







