తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరికి వచ్చేసింది.గత సీజన్లతో పోలిస్తే ఈసారి పెద్దగా టిఆర్పి రేటింగ్ సాధించలేకపోయింది.
ఎన్ని కొత్త టాస్క్ లు, గొడవలు, రొమాన్స్ పెట్టినప్పటికీ ప్రేక్షకులు ఎందుకో పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేకపోయారు.ఇక చివర్లోనైన కాస్త ఆకట్టుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం గట్టిగానే ట్రై చేస్తున్నారు.
అందుకే 12 వారం ఎలిమినేషన్ ఎవరు ఊహకందని విధంగా చేసి షాక్ ఇచ్చాడు.ఈ షాక్ నుండి ఇంకా అభిమానులు తేరుకోలేదు.
ఇదే కాదు ఈ వారం లో మరికొన్ని ట్విస్టులు , షాక్ లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు బిగ్ బాస్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం హౌస్ లో ఇనాయా సుల్తానా, శ్రీహాన్, రోహిత్, ఫైమా, కీర్తి భట్, రేవంత్, ఆది రెడ్డి, శ్రీ సత్యలు ఉన్నారు.వీరిలో ఓ ఇద్దర్ని డైరెక్ట్ ఎలిమినేషన్ చేయడమో , లేదా సీక్రెట్ రూమ్ కు పంపించడమో వంటిది బిగ్ బాస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ని ద్వారా అభిమానులకు షాక్ ఇచ్చి , చివర్లో ట్విస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట.మరి ఎవరిని ఎలిమినేషన్ చేస్తాడో.లేక సీక్రెట్ రూమ్ లో ఉంచుతాడో చూడాలి.ఇక ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారని తెలుస్తుంది.అందులో రోహిత్, ఫైమా, కీర్తి భట్, రేవంత్, ఆది రెడ్డి, శ్రీ సత్యలు ఈ వారానికి గానూ నామినేషన్‌లో ఉన్నట్లు సమాచారం.ఇనాయా సుల్తానా ఈ వారం కెప్టెన్ కావడంతో నామినేషన్ తప్పించుకుంది.
ఆమెతో పాటు శ్రీహాన్ కూడా సేఫ్ అయ్యాడని తెలుస్తుంది.







