ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.ఇక బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం మొత్తం అల్లరి అల్లరి సరదాలు ఆనందాలతో సాగింది.
కంటెస్టెంట్ లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్ ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అలా ఒకొక్క రోజు ఒక్కో కంటెస్టెంట్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
చివరగా రేవంత్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక అది అయిపోగానే బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ ను ఇవ్వగా ఆ టాస్క్ లో హౌస్ లో చివరికిప్తంగా అవతరించింది కంటెస్టెంట్ ఇనయ.
అయితే ఈ వారం కంటెస్టెంట్లకు ఆనందాన్ని మరింత డబుల్ చేయడం కోసం తాజాగా మరొక ఊహించని సర్ప్రైస్ ఇచ్చాడు బిగ్ బాస్.ఇంట్లోకి పంపించిన ఫ్యామిలీ మెంబెర్స్ ని కాకుండా బిగ్ బాస్ స్టేజ్ పైకి ఫ్రెండ్స్ అలాగే పలువురు ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్.
ఈ నేపథ్యంలోనే తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.కాగా ఆ ప్రోమోలో హౌస్ లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్ల కోసం కొందరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ మేరకు వీజే సన్ని, రోల్ రైడా, బుల్లెట్ భాస్కర్, సింగర్ సాకెత్, సోహైల్, ఇలా ఎంతోమంది స్టేజ్ పైకి వచ్చారు.దీంతో కంటెస్టెంట్లు మరింత సంతోషం వ్యక్తం చేశారు.లోపల హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల కోసం వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ బాగానే ఆట పట్టించారు.అయితే ఈసారి వారితో ఎవరు టాప్5 అనే గేమ్‌కు బదులుగా మరో డిఫరెంట్ గేమ్ ఆడించాడు హోస్ట్ నాగార్జున.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







