బిగ్ బాస్ షో ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతోంది.
ఇటీవల మొదలైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ అప్పుడే చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.ఇప్పటికే 11 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 12 వ వారం ముగింపు దశకు చేరుకుంది.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో 12వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా హౌస్ లో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు.
12వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు ఎలిమెంట్ అవుతారు అన్న విషయానికి వస్తే.ప్రస్తుతం శ్రీ సత్య, రాజ్, ఫైమాలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో రేపో మాపో బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే కూడా ప్రారంభం కాబోతోంది.ఇది ఇలా ఉంటే మరొకవైపు అరియానా బిగ్ బాస్ షో గురించి నిత్యం ఎవర్నో ఒకర్ని పిలిచి డిబేట్ పెడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన హమీద వచ్చింది.హమీద ఎంట్రీ ఇవ్వడంతోనే అరియానాతో కలసిస్టెప్పులు వేసింది.

అనంతరం అరియానా ఒక్కొక్క ఎమోజీలను చూపించి అది హౌస్ లో ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలి అంటూ ఒక గేమ్ ఆడించింది.ఆదిరెడ్డి గురించి మాట్లాడుతూ ఆదిరెడ్డి కొన్ని కొన్ని సార్లు రివ్యూ ఇస్తున్నాడు ఆ రివ్యూ తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.ఆ తర్వాత దండం పెడుతున్న ఎమోజిని చూపించడంతో, ఎవరి గేమ్ కి దండం పెట్టాలని అనుకుంటున్నావు అని ప్రశ్నించగా శ్రీ సత్య అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది హామీదా.చాలా వీక్స్ అనిపించింది శ్రీ సత్య ఈ వారం ఎలిమినేట్ అవుతుందేమో ఈవారం ఎలిమినేట్ అవుతుందేమో అని అనగా వెంటనే అరియానా నీ రాక కోసం హామీదా వెయిటింగ్ అనడంతో వెంటనే హమీద అయ్యో అంటూ తల పట్టుకుంది.







