యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో సినిమా రాబోతుందనే విషయం చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.ఎట్టకేలకు సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
మొదటి షెడ్యూల్ లో భాగం గా వారం రోజుల పాటు చిత్రీకరణ జరిపారు.మొదటి షెడ్యూల్ చిత్రీకరణ లో వచ్చిన అవుట్ పుట్ చూసి ప్రభాస్ సంతృప్తి వ్యక్తం చేశాడట.
అందుకే రెండవ షెడ్యూల్ కి డేట్లు కూడా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం మారుతి అదే పనిలో ఉన్నాడని సమాచారం అందుతుంది.
డిసెంబర్ రెండవ వారం ఆరంభం లో మారుతి ప్రభాస్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మళ్లీ మొదలవుతాయని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.
ప్రభాస్ మరియు మారుతి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఏంటి అంటూ చాలా మంది ముక్కులు విరుస్తున్నారు.
కానీ ఖచ్చితంగా వీరిద్దరి కాంబో ఒక క్రేజీ కాంబినేషన్ గా నిలుస్తుంది అంటూ కొందరు చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ అభిమానులు కొందరు మాత్రం ఈ సినిమా ఖచ్చితం గా పోతుందనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
కానీ మారుతీ మాత్రం ఆ విమర్శలు అనే ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ వర్క్ చేయబోతున్నాడు.
ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ కమిట్ అవ్వగా మరో హీరోయిన్ పాత్ర కోసం ముద్దుగుమ్మ అన్వేషణ సాగుతుందట.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు వచ్చే ఏడాది జూన్ లేదా జూలై వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
దసరా లేదా అంతకు ముందే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.ఈ సినిమా కాకుండా ప్రభాస్ ఆదిపురుష్ లతో పాటు మరో రెండు మూడు సినిమాలను కూడా లైన్ లో ఉంచిన విషయం తెలిసిందే.







