సాధారణంగా కుక్కలు 10 నుంచి 13 ఏళ్ల వరకు బతుకుతాయి.అయితే ఒక కుక్క మాత్రం ఏకంగా 22 సంవత్సరాలు బతికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
ఈ కుక్క పేరు జినో వోల్ఫ్.ఇది 2000, సెప్టెంబర్ 24న జన్మించింది.
దీనిని నవంబర్ 15, 2002లో కొలరాడో నివాసి అలెక్స్ తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.ఆ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దానికి పుట్టినరోజు వేడుకలు జరుపుతూనే ఉన్నాడు.
కాగా ఈ నవంబర్ 15న దానికి 22 ఏళ్లు నిండిన సందర్భంగా గ్రాండ్‌గా పుట్టినరోజు చేశాడు.
ఈ కుక్క ఇన్ని ఏళ్లు పాటు బతకడానికి కారణం అది తినే ఫుడ్ కారణమని యజమాని చెప్తున్నాడు.
ఈ కుక్కను తన తల్లిదండ్రులు మాన్హాటన్ బీచ్‌కి ఎక్కువగా తీసుకెళ్తూ ఉండేవారట.అక్కడ ఈ కుక్క ఇతర కుక్కలతో ఆడుకుంటూ చాలా యాక్టివ్ గా ఉండేదట.అలా ఈ కుక్క మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉందని యజమాని వెల్లడించాడు.గినోకి లాంగ్ డ్రైవ్స్ అంటే కూడా ఎక్కువగా ఇష్టమట.
అందుకే దానిని కారులో కూర్చోబెట్టుకొని చాలాసార్లు లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళినట్లు తెలిపాడు.కారులో విండో పక్కన కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కూడా గినోకి చాలా ఇష్టమట.

ఇంతకుముందు ఎక్కువ కాలం బతికిన కుక్కగా పెబిల్స్ అనే కుక్క మీద రికార్డు ఉండేది.2022న అక్టోబర్ నెలలో వృద్ధాప్య సమస్యల వల్ల చనిపోయింది.మునుపటి రికార్డ్ హోల్డర్, టోబికీత్ చివావా కుక్క ఇప్పటికీ జీవించి ఉంది.దాని వయసు ఇప్పుడు 21 ఏళ్లు.







