Dubai Lottery : దుబాయ్ లాటరీలో భారీ జాక్ పాట్ కొట్టిన భారతీయుడు..అక్షరాలా రూ....

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ రాసి పెట్టి ఉండాలే కానీ దీనెమ్మా జీవితం ఎన్ని మలుపులైనా తిరుగుతుంది.అయితే లక్కు తొందరగా వచ్చేసి దశ తిరగాలంటే మాత్రం చాలా మంది లాటరీ లానే నమ్ముకుంటారు.

 An Indian Who Hit A Huge Jackpot In Dubai Lottery Literally Rs , Indian, Dubai L-TeluguStop.com

లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ ఒక్కసారిగా కోటీశ్వరులు అయ్యిపోవాలని ఆలోచించే వారు లేకపోలేదు.ముఖ్యంగా అరబ్బు దేశాలలో ఈ విధమైన లక్కీ డ్రాలకు మంచి డిమాండ్ ఉంది.

మరీ ముఖ్యంగా అక్కడి లాటరీ టిక్కెట్ల కొనుగోలులో అత్యధిక శాతం మంది భారతీయులే పాల్గొంటారట.అదృష్టం తలుపు తట్టేంత వరకూ టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే ఉంటారట.

ఈ క్రమంలోనే దుబాయ్ లో ఉంటున్న ఓ భారతీయుడుకి అదృష్టం వరించింది .ఎన్నో ఏళ్ళుగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్న భారతీయుడికి ఊహించని విధంగా కోట్లు వచ్చి పడ్డాయి.కువైట్ లో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దిలీప్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా మహాజూజ్ లక్కీ డ్రాలో పాల్గొంటున్నాడు.భారీ జాక్ పాట్ కొట్టేంత వరకూ తగ్గేదే లే అన్నట్టుగా ఎప్పటికప్పుడు టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.

ఈ సారైనా అదృష్టం తనను వరించక పోదా అంటూ .

Telugu Dirhams, Indianjackpot, Dileep, Dubai Lottery, Indian, Mahajuj Lucky-Telu

మహాజూజ్ లక్కీ డ్రా లో టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే ఎప్పటిలానే లక్కీ డ్రా తగిలిందా లేదా అంటూ పడుకునే ముందు ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటున్న దిలీప్ కు మహాజూజ్ లక్కీ డ్రా నుంచీ మెయిల్ వచ్చింది.షాక్ అవుతూనే మెయిల్ చూడగానే అతడు జీవితంలో ఊహించని విధంగా, సంపాదించ లేని విధంగా కళ్ళు చెదిరిపోయేలా 20 మిలియన్స్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు అంటే భారత కరెన్సీలో దాని విలువ అక్షరాలా రూ.44 కోట్లు పై మాటే.దాంతో అతడికి నోట మాటలేదు, ఆ షాక్ నుంచీ తెలుకోవడానికి చాలా సమయం పట్టిందట, అంతేకాదు అది నిజమా కాదా అని లక్కీ డ్రా నిర్వాహకులకు ఫోన్ చేయగా మీరు భారీ మొత్తం గెలుచుకున్నారని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడట.

నా పిల్లల భవిష్యత్తు ఇకపై మరింత బాగుంటుందని, త్వరలో ఉన్న ఉద్యోగం మానేసి మంచి బిజినెస్ చేస్తానని ఇక ప్రపంచం మొత్తం తన కుటుంబంతో తిరిగి వస్తానని చెప్పాడు దిలీప్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube