అల్లుడు తనను మోసం చేశాడంటూ సొంత మామ ఆరోపించడం దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీలో కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళితే.
కేరళలోని కాసరగాడ్‌కు చెందిన మొహ్మద్ హఫీజ్‌కు 2017లో దుబాయ్‌కి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అబ్ధుల్ లాహిర్ హాసన్ కుమార్తెతో వివాహం జరిగింది.ఈ క్రమంలో అల్లుడికి తన వ్యాపారంతో పాటు కొన్ని ఆస్తులపై యాజమాన్యాన్ని కూడా అందించాడు.
అయితే అల్లుడు తనను మోసం చేస్తున్నాడంటూ హాసన్ మూడు నెలల క్రితం కేరళలలోని అలువా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.100కోట్లకు పైగా డబ్బుతో నిందితులు పరారీలో వున్నారని.వారు ప్రస్తుతం గోవాలో వున్నట్లుగా తెలియడంతో కేసు దర్యాప్తును నవంబర్ 24న .కేరళ క్రైమ్ బ్రాంచ్ విభాగానికి అప్పగించారు.అలువా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారని, అలాగే తన అల్లుడిని కనీసం విచారణకు కూడా పిలవలేదని హాసన్ ఆరోపిస్తున్నారు.దీనితో పాటు 1.5 కోట్ల విలువైన కారును కూడా పోలీసులు రికవరీ చేయలేకపోయారని ఆయన ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు.

ఈడీ రైడ్ తర్వాత విధించిన జరిమానాను చెల్లించడానికి తన అల్లుడు రూ.4 కోట్లు అడగటంతో అతని మోసం ప్రారంభమైందని హాసన్ ఆరోపించారు.ఆ తర్వాత నుంచి భూమి కొనుగోలు, ఫుట్‌వేర్ షోరూమ్ ప్రారంభిస్తున్నానని.ఇలా అనేక సాకులు చెబుతూ తన నుంచి అల్లుడు రూ.107 కోట్లు రాబట్టినట్లు ఆయన మీడియాకు తెలిపారు.అయితే ఈ మోసం వెనుక తన అల్లుడుతో పాటు సహచరులు కూడా సహకరించారని హాసన్ అనుమానిస్తున్నారు.
ఈ మేరకు పోలీసులు కొందిరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై రంగంలోకి దిగిన కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు.







