కంపెనీలు తమ సిబ్బందికి విధించే కొత్త కొత్త నిబంధనలు కొన్ని సార్లు విచిత్రంగా ఉంటాయి.వాటిని వినగానే ఒక్కోసారి నవ్వు పుట్టుకొస్తుంది.
తాజాగా ఎయిర్ ఇండియా తన క్యాబిన్ క్రూ సభ్యుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.ఆ నిబంధనల జాబితాను ఇటీవల విడుదల చేసింది.
టాటాలు ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, క్యాబిన్ సిబ్బంది వస్త్రధారణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.ముత్యాలు, చెవిపోగులు ఉండకూడదు.
బట్టతల ఉన్న పురుషులు క్లీన్ షేవ్ చేసుకోవాలి.మణికట్టు, మెడ లేదా చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు తాడులు ధరించడానికి అనుమతి లేదు.పురుషులు, మహిళా సిబ్బందికి వస్త్రధారణ మార్గదర్శకాలు జాబితాలో ఉన్నాయి.
మగ సిబ్బంది ఖచ్చితంగా హెయిర్ జెల్ వాడాలి.బట్టతల ఉన్నవారు తప్పనిసరిగా తమ తలలను నీట్‌గా షేవింగ్ చేసుకోవాలి.పూర్తిగా బట్టతల కనిపించాలని కోరుకునే పురుష క్యాబిన్ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజూ తల షేవింగ్ చేయండి తప్పనిసరి.
మణికట్టు, మెడ లేదా చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాన్ని ధరించడానికి అనుమతి లేదు.మహిళా సిబ్బంది కోసం కూడా కొత్త నియమాలు నిబంధనలు విధించారు.ముత్యాల చెవిపోగులు అనుమతించబడవు.ఫ్లైట్ అటెండెంట్‌లు డిజైన్ లేకుండా బంగారం లేదా డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించగలరు.
నాలుగు బ్లాక్ బాబీ పిన్‌లను మాత్రమే ఉపయోగించవచ్చు.ఐ షాడో, లిప్‌స్టిక్, నెయిల్ పెయింట్, హెయిర్ షేడ్ వంటివి నిబంధనల మేరకు మాత్రమే ఉండాలి.
డిజైన్, రాళ్ళు లేని ఒక కంకణం మాత్రమే ధరించాలి.రింగ్స్ వెడల్పు 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు.
మహిళలు కూడా మణికట్టు, మెడ లేదా చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు, తాయెత్తులు ధరించకూడదు.విమాన విధుల కోసం చీర, ఇండో-వెస్ట్రన్ దుస్తులు రెండింటితో పాటు చర్మపు రంగుకు సరిపోయే షీర్ కాఫ్-లెంగ్త్ మేజోళ్ళు తప్పనిసరిగా వేసుకోవాలి.
ఈ నిబంధనలు ఎలా ఉన్నా, బట్టతల ఉన్న వారు నున్నగా రోజూ గుండు చేసుకోవాలనడం విచిత్రంగా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.