MP Ram Mohan Naidu : అది ఒక పబ్లిక్ స్టంట్ వైసీపీ పై ఎంపీ రామ్మోహన్ నాయుడు సీరియస్ కామెంట్స్..!!

ఇటీవల శ్రీకాకుళం టూర్ లో సీఎం జగన్ వైయస్సార్ జగన్ అన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పత్రాల పంపిణీ చేపట్టడం తెలిసింది.వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో  సమగ్ర భూముల రీ సర్వే.

 Mp Ram Mohan Naidu Serious Comments On Ycp Governament Mp Ram Mohan Naidu, Tdp,-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి పూనుపొంది వచ్చే ఏడాది చివరికల్లా పూర్తవుతుందని తెలియజేశారు.రెండేళ్ళ  కిందట భూ సర్వే రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ అయిందని.

వచ్చే ఏడాది చివరికి పూర్తవుతుందని తెలిపారు.అయితే ఈ శాశ్వత భూహక్కు పథకం కార్యక్రమంపై టీడిపి  ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది ఒక పబ్లిక్ స్టాంట్ అని పేర్కొన్నారు.భూములు కబ్జా తప్ప వైసీపీ నేతలకు మరో ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లాల పర్యటనకు వెళ్లడానికి సీఎం జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఎందుకు మాట్లాడటం లేదని రామ్మోహన్ నాయుడు నిలదీశారు.

ఋషికొండను ప్రైవేటీపరం చేసి.గుండు కొట్టించారని దానిపై.మాట్లాడితే సమాధానం చెప్పరని విమర్శించారు.రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల పేరిట డ్రామాలాడుతున్నారని రామ్మోహన్ నాయుడు వైసిపి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube