US Walmart shooting :అమెరికా : గన్ కల్చర్ ఎఫెక్ట్...10 మంది మృతి...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో మరో సారి గన్ కల్చర్ విరుచుకుపడింది.ఈ సారి వర్జీనియాలోని ఓ స్టోర్ లో జరిగిన కాల్పులలో భారీ ప్రాణ నష్టం జరిగింది.

 10 Killed In Mass Shooting At Us Walmart Store, Gunman Dead,us Walmart Shooting,-TeluguStop.com

దాంతో మరో సారి గన్ కల్చర్ పై తీవ్ర స్థాయిలో చర్చ మొదలయ్యింది.కాగా ఈ ఘటనలో మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు స్థానిక పోలీసులు.

ఈ దారుణం జరగడానికి కారణం ఏంటి ఎలా జరిగింది అనే వివరాలను పోలీసులు వెల్లడించారు….

అమెరికాలోని వర్జీనియాలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్ రద్దీగా ఉంది.

రాత్రి సమయం కావడంతో ప్రజల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది.ఈ పరిస్థితిని అదునుగా చూసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తీ స్టోర్ లోకి చొరబడి అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పుల కు తెగబడ్డాడు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజల భయంతో పరుగులు పెడుతున్నా సరే కనికరం లేకుండా కాల్పులకు తెగబడ్డాడు.ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా ప్రజలు అక్కడికక్కడే మృతి చెందారని తెలుస్తోంది ఈ ఘటన సమయంలోనే స్టోర్ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న చెసాపీక్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు…

Telugu America, Club Colorado, Gun, Gunman, Walmart, Virginia-Telugu NRI

భయంతో స్టోర్ నుంచీ పరుగులు పెడుతూ బయటకు వస్తున్న వారిని సురక్షిత ప్రదేశానికి పంపారు.స్టోర్ లోకి వెళ్లి చూడగా చాలా మంది చనిపోయి ఉన్నారని ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు.కాగా స్టోర్ లోకాల్పులకు తెగబడిన వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడని అయితే అతడు ఎవరనే విచారణ చేపట్టామని మీడియాకు తెలిపారు.

కాగా 10 మంది చనిపోయారని అంటున్నా అంతకంటే భారీగానే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ విషయాలను మాత్రం పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు.

రెండు రోజుల క్రితం అమెరికాలోని కొలరాడో లో ఓ నైట్ క్లబ్ లో జరిగిన దాడిలో ఐదు గురు మృతి చెందిన ఘటన మరువక ముందే ఈ దారుణం చోటు చేసుకోవడంతో అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube