Kamal Hasan: తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ పాలైన నటుడు కమల్ హాసన్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు స్వల్ప జ్వరంతో బాధపడుతుండడంతో మెరుగైన చికిత్స కోసం ఈయనని చెన్నైలోనే పోరూరు రామచంద్ర ఆస్పత్రికి తరలించారు.

 Actor Kamal Haasan Was Admitted To The Hospital Due To Serious Illness Details,-TeluguStop.com

నిన్న కమల్ హాసన్ హైదరాబాద్ చేరుకొని దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ గారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన అనంతరం ఈయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం గురించి తెలియాల్సి ఉంది.ఇలా కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు మీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆందోళన చెందుతున్నారు.

ఇలా ఉన్నఫలంగా కమల్ హాసన్ అనారోగ్యానికి గురికావడంతో సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.

Telugu Kamal Haasan, Bharateeyudu, Vishwanath, Kamalhasan, Kamlahasan, Vikram-Mo

ఇక నిన్న ఎంతో ఆరోగ్యంగా విశ్వనాధ్ గారిని కలిసి చెన్నై వెళ్లిన ఈయన ఉన్నఫలంగా అస్వస్థతకు గురయ్యారు.అయితే ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే గతంలో కూడా ఈయన కరోనా బారిన పడి ట్రీట్మెంట్ చేయించుకుని క్షేమంగా కోలుకున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube