Hansika Motwani Marriage : కాబోయే భర్తతో హన్సిక.. పెళ్లి కళ వచ్చేసింది.. పిక్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది హన్సిక మోత్వానీ.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి వరుస అవకాశాలను అందుకుంది.అప్పటి నుండి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇక హన్సిక తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేక పోయిన కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

 Hansika Is Busy With Her Wedding Celebration, Hansika Motwani, Hansika Motwani M-TeluguStop.com

తమిళ్ లో సినిమాలు చేస్తూనే ఉండగా ఈమె పెళ్లి వార్తలతో ఈమె ఈ మధ్య నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.వరుసగా ఈమె పెళ్లి వార్తలు రావడంతో హన్సిక తన మ్యారేజ్ గురించి స్వయంగా ప్రకటించింది.

ఈమె డిసెంబర్ 4న తన బిజినెస్ పార్ట్ నర్, స్నేహితుడు అయిన సోహైల్ నే లైఫ్ పార్ట్ నర్ గా చేసుకోబోతుంది.ఇక ఈమె పెళ్లి పనులు సోమవారం నుంచే మొదలయ్యాయి.

దీంతో ఈ పెళ్లి వేడుకల్లో ఈ యాపిల్ బ్యూటీ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.తాజాగా ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.హన్సికను చూసిన ఆమె ఫ్యాన్స్ ఈమెకు పెళ్లి కళ వచ్చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.హన్సిక రెడ్ కలర్ చీరలో మెరిసిపోతుంది.

ఈమె తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Hansika Busy, Hansika Motwani, Kollywood, Tollywood-Movie

ఇక హన్సిక పెళ్లి రాజస్థాన్ లోని ఒక ప్యాలెస్ లో జరగబోతున్నట్టు తెలుస్తుంది.కేవలం కుటుంబ సభ్యులు, దగ్గర స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరవ్వనున్నారు.ఆ తర్వాత రెసెప్షన్ మాత్రం అందరి మధ్య ఘనంగా జరగనుందట.

తెలుగు తమిళ్ భాషల్లో 50కి పైగానే సినిమాల్లో నటించిన హన్సిక మ్యారేజ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఇక ఈమె తన మ్యారేజ్ వీడియో రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు అమ్మినట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube