జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా ఓటమి చెందారు.స్వయంగా పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందారు.2019లో వైసీపీ గాలి హోరున వీచినా, దానిని ఎదుర్కొని రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ జనసేన నుంచి నిజం సాధించారు.దీంతో ఆ పార్టీలో గెలిచిన ఒకే ఒక్కడిగా ఆయన పేరు మారుమోగింది.
మొదట్లో జనసేన తరుపున ఆయన బలంగా నిలబడుతూ, వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పార్టీకి అండగా నిలిచేవారు.
అయితే ఆ తర్వాత క్రమంలో నాదెండ్ల మనోహర్ తనను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ సైతం తనను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ, జనసేన కు ఆయన దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సీఎం జగన్ పనితీరును ప్రశంసిస్తూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వంటివి జనసేన అధిష్టానానికి ఆగ్రహం కలిగించాయి .దీంతో జనసేన కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతూనే వచ్చారు.ఈ క్రమంలోనే రాపాక వరప్రసాద్ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టికెట్ ఇచ్చే అవకాశం లేదు.దీంతో ఆయన వైసిపి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.2024 ఎన్నికల్లో తాను రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటానంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాపాక చెప్పకొచ్చారు.ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలోని వైసీపీలో అనే గ్రూపులు ఉన్నాయి.ఈ గ్రూపుల మధ్య ఆధిపత్యం చాలా కాలం నుంచి నడుస్తోంది.అయినా రాపాక మాత్రం జగన్ తనకే టికెట్ ఇస్తారనే ధీమాతో ఉన్నారు.







