దళిత బంధు కాదు దగా బంధు...!

నల్లగొండ జిల్లా:చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో దళిత బంధు పథకంలో అధికార పార్టీ నేతల తీరుపై స్థానిక దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగి,గ్రామ సర్పంచ్ మరియు సెక్రెటరీని నిలదీసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన నిరుపేద దళితులకు దళిత బంధు ఇవ్వకుండా,అధికార పార్టీకి చెందిన అనర్హులకు వర్తింపజేస్తున్నారని మండిపడ్డారు.

 Dalit Brother Not Daga Brother...!-TeluguStop.com

దళితబంధును స్థిర,చరాస్థులు కలిగి ఆర్థికంగా ఉన్నవారికే ఇస్తున్నారని, అర్హులైన నిరుపేదలను,ఇతర పార్టీలకు చెందిన వారికి ఇవ్వట్లేదని,అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ తనకు సంబంధించిన వారికి దళిత బంధు వచ్చేలా లిస్టు తయారు చేసి ఇచ్చిందని,దీనికి గ్రామ కార్యదర్శి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.గ్రామంలోని నిరుపేద దళితులకు దళితబంధు రాకుండా అనర్హులకు ఇప్పించేలా కుట్ర చేస్తున్నారని,ఇది సరైన చర్య కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో నిజమైన అర్హులకు,నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని,దీనిపై జిల్లా అధికార యంత్రాంగం విచారణ జరిపి,అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube