మాంగనీస్ గనుల తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ రసాభాసగా మారింది.దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లాలోని దువ్వాంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు గుప్పించారు.దీంతో కాంగ్రెస్ నేతపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని సమాచారం.
ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగడంతో ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారిందని సమాచారం.







