బాలీవుడ్ పరిస్థితి చాలా కాలంగా అస్సలు బాగాలేదు.ఈ మధ్య కాలంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు.
అయినా కూడా బాలీవుడ్ లో సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి.మరో వైపు అవి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి.
కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే తెలుగు సినిమా లేదా ఇతర సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి.డైరెక్ట్ హిందీ సినిమా ల కంటే కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా ల యొక్క డబ్బింగ్ వర్షన్ లేదంటే రీమేక్ వర్షన్ లు అక్కడ ఆడుతున్నాయి.
ఆర్ ఆర్ ఆర్.కేజీఎఫ్ 2 తో పాటు తాజాగా కాంతార సినిమా కూడా అక్కడ వంద కోట్ల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.
హిందీలో ఎట్టకేలకు మరో విజయం నమోదు అయ్యింది.అదే దృశ్యం 2.

రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయకున్నా కూడా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా పాతిక కోట్ల వసూళ్లు నమోదు చేసిందనే వార్తలు వస్తున్నాయి.మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ను ఇప్పటికే తెలుగు లో రీమేక్ చేయడం జరిగింది.అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా తాజాగా హిందీలో రీమేక్ అయ్యింది.అజయ్ దేవగన్ హీరోగా శ్రియ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా లో టబు కీలక పాత్రలో నటించింది.
హీరోయిన్ గా శ్రియ ఈ సినిమా లో నటించడం తో అందరికి మరింత చేరువ అయ్యింది.ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో మళ్లీ హడావుడి మొదలు అయ్యింది.
ప్రేక్షకులు మరియు బాలీవుడ్ వర్గాల వారు హిందీ సినిమా పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి అంటూ మాట్లాడుకుంటున్నారు.








