బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ.ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా వెండితెర హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు.
అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించిన బాలాదిత్య తాజాగా బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బాలాదిత్య ఉన్నారని తెలియగానే ఈయనపై ఎన్నో అంచనాలు పెరిగాయి అయితే ఊహించని విధంగా బాలాదిత్య పదవ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ కూల్ గా పేరు సంపాదించుకున్న ఈయన సిగరెట్ విషయంలో మాత్రం నాన్న రచ్చ చేశారు.
సిగరెట్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూతో గొడవకు దిగి పెద్ద ఎత్తున రచ్చ చేశారు.
ఈ సిగరెట్ విషయంలో బాలాదిత్య గీతూ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకుంది అయితే ఇద్దరు కూడా వారం వ్యవధిలోనే బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాలాదిత్య బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే గీతూతో జరిగిన గొడవ గురించి నోరు విప్పారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన నేను బిగ్ బాస్ షో గెలవలేకపోవచ్చు.కానీ మన ఇంట్లో కూడా ఇలాంటి ఓ మనిషి ఉంటే బాగుండేది అని చాలామంది అనుకున్నారు.ఆ అభిమానం చాలు నాకు అంటూ తెలిపారు.ఇలా నేను పెరిగానంటే అందుకు కారణం నా తల్లితండ్రులు నా గురువు లేనని ఈయన తెలియజేశారు.ఇక సిగరెట్ విషయం గురించి మాట్లాడుతూ సిగరెట్ నా వీక్నెస్ కాదు అయితే ఈ విషయం బయటకి మరోలా వెళ్తుందని భావించి తాను పూర్తిగా సిగరెట్ తాగడమే మానేశానని బాలాదిత్య తెలిపారు.సిగరెట్ విషయంలో తాను గీతూను తిట్టినందుకు బయటకు వచ్చిన వెంటనే గీతూ తల్లి గారికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను అంటూ ఈ సందర్భంగా బాలాదిత్య గీతూతో జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు.