Chiranjeevi Pawan Kalyan: రాజకీయాలకు పవన్ కరెక్ట్.. తమ్ముడు సీఎం అవడం ఖాయం.. చిరు కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అనుబంధం ఉంది.సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారందరూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాలలో తమ మార్క్ ఏంటో నిరూపించుకుంటున్నారు.

 Pawan Kalyan Will Become Chief Minister Chiranjeevi Comments Viral Details, Pawa-TeluguStop.com

ఈ క్రమంలోనే నందమూరి తారకరామారావు బాటలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం రాజకీయాలలోకి అడుగు పెట్టారు.చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవి మన్మోహన్ సింగ్ హయామంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా రాజకీయాలలో కేంద్ర మంత్రిగా కొనసాగిన చిరంజీవి మెల్లిమెల్లిగా రాజకీయాలకు దూరమయ్యారు.ఇకపోతే తాజాగా ఈయన హైదరాబాద్‌ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజీ అల్ముని వెల్‌ ఫేర్ అసోసియేషన్‌ నిర్వహించిన పూర్వ మిత్రుల సమ్మేళనంలో పాల్గొని రాజకీయాల గురించి చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Telugu Chiranjeevi, Chiru Pawan Cm, Janasena, Brothers, Pawan, Pawan Kalyan Cm-P

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాలు అందరికీ సూట్ అవ్వమని ముఖ్యంగా తనకు రాజకీయాలు ఏమాత్రం పడలేదని తెలిపారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది.అలాగే ఎంతో కటువుగా ప్రవర్తించాల్సి ఉంటుంది.ఇలా రాజకీయాలకు తాను సూట్ అవ్వనని రాజకీయాలకు పవన్ కళ్యాణ్ సరైనోడు అంటూ ఈయన కామెంట్స్ చేశారు.అయితే ఎప్పటికైనా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూస్తానని ఈయన తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.ఇలా పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube