ఈ రోజుల్లో 20 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ కూడా రావడం లేదు.నిజానికి టీ, కాఫీలు కూడా 20 రూపాయలు పెడితే గానీ దొరకడం లేదు.
అలాంటి ఈ రోజుల్లో విజయవాడలోని శిఖామణి సెంటర్ ఒక భోజనశాల నిర్వాహకులు కేవలం 20 రూపాయలకే రకరకాల ఐటమ్స్ తో కడుపునిండా భోజనం పెడుతున్నారు.ఎవరూ కూడా అర్ధాకలి, ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఐదుగురు ఉద్యోగులు ఈ భోజనశాలను ఓపెన్ చేశారు.
ఈ ఉద్యోగులలో ఒకరి సోదరి ఈ భోజనశాలను రన్ చేస్తున్నారు.ఈ భోజనశాల రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఓపెన్ చేస్తారు.
ఈ టైమింగ్స్ పొద్దున్నే ఎందుకు స్టార్ట్ కావంటే.భోజనశాలలోని వంట మనుషులు ఉదయం 8 నుంచి వంట చేయటం ప్రారంభిస్తారట.రూ.20కే ఫుల్ మీల్స్ అంటే చాలామంది వస్తారు కాబట్టి వారందరికీ సరిపడా ఫుడ్ సిద్ధం చేయడం కోసం వంట మనుషులకు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం పడుతుంది.ఇక అప్పుడే భోజనశాల ఓపెన్ చేసి వేడి వేడి ఆహారం సర్వ్ చేయడం ప్రారంభిస్తారు.ఈ భోజనంలో రెండు, మూడు రకాల కూరలు, ఒక కప్పు అన్నం, సాంబారు, మజ్జిగ ఆఫర్ చేస్తున్నారు.
అలానే తప్పకుండా ఏదో ఒకరకం రోటి పచ్చడి అందిస్తున్నారు.మంచి రుచి కోసం వాము కలిపిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా 20 రూపాయలలోనే అందించడం మరో విశేషం.

రేటు తక్కువైనా ఆహారం ఎక్కువగా అందించడంతోపాటు శుభ్రత విషయంలో కూడా ఈ భోజనశాల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.వంట సామాగ్రితో పాటు సర్వింగ్ ప్లేట్స్ అన్నీ కూడా వేడి నీటితో అత్యంత శుభ్రంగా కడిగి వచ్చిన వారిని సంతృప్తి పరుస్తోంది.ఆయా పచ్చళ్లను రోటిలో నూరుతూ రుచిని పెంచుతోంది.20 రూపాయలకే ఇన్ని ఐటమ్స్ కడుపునిండా తినేవారు ఈ ఉద్యోగులను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.







