వినడానికి వింతగా అనిపించినా ఇది జరిగింది… మరెక్కడో కాదు, ఇండియాలోనే.సాధారణంగా జలపాతం అంటే కొండలపై నుంచి నీరు లోయలలోకి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది కదా.
మరి అలాంటిది… కిందనుండి పైకి నీళ్లు వెళ్లడమేంటని అనుమానం కలుగుతుంది కదూ.అయితే దానికి అనేక కారణాలు ఉంటాయి.ప్రకృతి అందాలను వర్ణించడం వీలుకాదు.జలపాతం జలజల పారుతుంటే.చూసే కనులకు ఎంతో హాయిగా ఉంటుంది.అందుకే పర్యాటకులు ఇలాంటి స్పాట్స్ కి వెళ్ళినపుడు గంటలు గంటలు సమయాన్ని గడుపుతారు.
అయితే ఒక సాధారణ విషయానికే జనాలు ఆశ్చర్యపోయి తిలకిస్తే… ఇలాంటి అసాధారణ విషయాలను ఎవరు చూడాలని అనుకోరు? ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రసిద్ధిగాంచిన జలపాతాలు పర్యాటక ప్రాంతాలుగా మారిపోయాయి.కానీ కొండ పైనుంచి లోయలోకి దూకబోయే క్రమంలో నీరు తిరిగి పైకి ఎగిరిపోతే.
ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి.ఇక అది చూడాలంటే మీరు మహారాష్ట్ర వెళ్లాల్సిందే.

అవును, మహారాష్ట్రలోని ఓ వాటర్ ఫాల్ రివర్స్ గేర్‌లో వెనక్కి పోతోంది.వాటర్ ఫాల్‌కు వ్యతిరేక దిశలో లోయలో బలమైన గాలులు వీయడంతో ఇలా జరుగుతుందని అర్ధం అవుతోంది.అయితే చూడటానికి ఇది అద్భుతంగా కనబడుతోంది.ఈ అరుదైన అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియోను వండర్ ఆఫ్ సైన్స్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.
అంతేకాకుండా ఈ వీడియో ఆహుతులను ఎంతగానో అలరిస్తోంది.ఇక మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.







