Balayya Unstoppel 2 : ఎన్టీఆర్ చేస్తే తప్పు బాలయ్య బాబు చేస్తే తప్పు కాదా.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ పేక్షకులకు నందమూరి ఫ్యామిలీ గురించి నందమూరి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నందమూరి హీరోల చీమల పరంగా గాని లేదంటే రాజకీయపరంగా గాని ఏదైనా మాట్లాడితే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

 Balayya Praised Ysr In Unstoppable 2 Show, Balayya, Ysr, Unstoppable 2 Show, Tol-TeluguStop.com

అయితే ఎప్పటినుంచో వినిపిస్తున్న ఒక వార్త ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడా లేదా? ఈ విషయం పట్ల గత కోన్నేలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.అంతేకాకుండా ఈ వార్త మిస్టరీగా కొనసాగుతూనే ఉంది.

ఇది ఇలా ఉంటే నందమూరి ఫ్యామిలీ లో ఏ ఒక్కరిపై జరిగిన ఏ సమస్య వచ్చినా కూడా వారందరూ కలిసి ఒక్క మాట మీద నిలబడి ఒకే విధంగా స్పందిస్తున్నారు.అందుకు ఉదాహరణగా అయితే ఇటీవలె సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై నందమూరి ఫ్యామిలీ మొత్తం స్పందించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెడితే ఆయన గౌరవం పెరగదు అనే చురకలు అంటించారు జూనియర్ ఎన్టీఆర్.

చెప్పాలి అంతే ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు,అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు అని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.యూనివర్సిటీకి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేదు కదా అని చెప్పుకొచ్చాడు.

అయితే ఎన్టీఆర్ ఎంతో కూల్ గా మాట్లాడడంతో పలువురు నందమూరి అభిమానులే ఎన్టీఆర్ కు తగ్గ మనవడు తారక్ కాదు అంటూ తిట్టిపోస్తూ ఎన్టీఆర్ పెద్ద తప్పు చేస్తున్నాడు అంటూ నిందించారు.

Telugu Balayya, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ వైయస్సార్ ను ప్రశంసించడం టిడిపి నేతలకు అలాగే నందమూరి అభిమానులకు నచ్చడం లేదు.తాజాగా రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య బాబు వైయస్సార్ గ్రేట్ లెజెండ్ ను మిస్ అయ్యాం అని చెప్పుకొచ్చాడు.అయితే బాలయ్య బాబు మాటలపై పలువురు స్పందిస్తూ ఆయన గౌరవం కొద్దిగా అన్నారు అని మరి ఇంతకుముందు ఎన్టీఆర్ను ట్రోల్ చేసినప్పుడు అదే గౌరవం అనుకోవచ్చు కదా! మరి అప్పుడు ఎన్టీఆర్ ను ఎందుకు ట్రోలింగ్స్ చేశారు అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తే తప్పు ఇప్పుడు బాలకృష్ణ చేస్తే తప్పు కాదా అంటూ నిలదీస్తున్నారు.బాలయ్య బాబు మాటలు కరెక్ట్ అన్నప్పుడు తారక్ మాటలు కూడా పాజిటివ్ అని తీసుకోవాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube