సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ చనిపోయిన బాధలో పుట్టెడు దుఃఖంలో ఉన్నారనే సంగతి తెలిసిందే.మహేష్ ను ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు.
ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటంతో 2022 సంవత్సరం మహేష్ కు బ్యాడ్ ఇయర్ అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ నటి రోజా పద్మాలయ స్టూడియోస్ లో కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించటంతో పాటు శత్రువులు లేని ఒకే ఒక్క హీరో కృష్ణ అని అన్నారు.
దేవుడు తనకు కావాలని కృష్ణను తీసుకెళ్లారని రోజా కామెంట్లు చేశారు.కృష్ణకు తాను వీరాభిమానినని ఆమె పేర్కొన్నారు.కృష్ణ చాలా టాలెంటెడ్ అని ఆయనతో కలిసి యాక్ట్ చేసే సమయంలో ప్రతిరోజూ ఆయననే చూసేదానినని రోజా వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు పేరు వినబడితే కృష్ణ రూపం గుర్తుకొస్తుందని ఆమె తెలిపారు.
జయాపజయాలను సమానంగా తీసుకోవాలని కృష్ణ జీవితం నుంచి నేర్చుకోవాలని ఆమె కామెంట్లు చేశారు.ఎంత ఎదిగినా అందరితో మంచిగా ఉండాలనే విషయాన్ని కూడా కృష్ణ నుంచి నేర్చుకోవాలని రోజా పేర్కొన్నారు.
బాల్యం నుంచి మహేష్ బాబు అంటే ఇష్టమని రోజా కామెంట్లు చేశారు.
మహేష్ బాబుకు అత్తగా నటించాలని ఉందని రోజా తన మనసులోని కోరికను బయటపెట్టారు.రోజా చేసిన కామెంట్లలో తప్పేం లేకపోయినా మహేష్ కు అత్తగా నటించాలని చెప్పిన ప్రదేశం, సందర్భం కరెక్ట్ కాదని నెటిజన్లు రోజాను ట్రోల్స్ చేస్తున్నారు.మరో సందర్భంలో రోజా ఇలా చెప్పి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళసై వెంట రోజా కనిపించడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.