Sitara, krishna : మీరే నా హీరో.. మీరు గర్వపడేలా చేస్తా తాతయ్య.. సితార ఎమోషనల్ పోస్ట్!

సూపర్ స్టార్ కృష్ణ తరచూ తన కూతుర్ల వద్ద లేదా హైదరాబాద్లో తన ఫామ్ హౌస్ లో ఉండేవారు అయితే ఆయన ఎక్కడ ఉంటే తన కుటుంబ సభ్యులందరూ కూడా వారాంతంలో అక్కడికి రావాల్సిందే.ఇలా వీకెండ్ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట భోజనం చేయడం ఎంతో సరదాగాగడుపుతుంటారు ఇక మహేష్ బాబు కూడా హైదరాబాదులో ఉంటే కచ్చితంగా వీకెండ్ తన తండ్రి దగ్గరకు వెళ్లేవారు.

 You Are My Hero You Make Me Proud Grandpa Sitaras Emotional Post You Are My Hero-TeluguStop.com

ఇక సితార గౌతమ్ లకు తన తాతయ్యతో ఎంతో మంచి బాండింగ్ ఏర్పడింది.

ఇలా తాతయ్యతో ఎంతో మంచి అనుబంధం ఏర్పరచుకున్న ఈ పిల్లలకి ప్రస్తుతం తాతయ్య లేరని వార్త మింగుడు పడటం లేదు.

తన తాతయ్య చివరి చూపు కోసం గౌతం విదేశాల నుంచి వచ్చారు అలాగే సితార సైతం తన తాతయ్య ఆఖరి చూపులు చూస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా సితార తన తాతయ్యను తలచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా సితార పోస్ట్ చేస్తూ… వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పటికీ మునుపటిలా ఉండదు తాతయ్య.మీరు మాకు ఎన్నో విలువైన విషయాలను చెప్పడమే కాకుండా మమ్మల్ని ఎంతో సంతోషపెట్టారు.ఇప్పుడు ఆ విషయాలన్నీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోతాయి మీరే నా హీరో ఎప్పటికైనా మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను.

మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం తాతగారు అంటూ సోషల్ మీడియా వేదికగా కృష్ణ గారితో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube