ఏపీ సీఎం జగన్ రేపు హైదరాబాద్కు రానున్నారు.ఈ నేపథ్యంలో దివికేగిన సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి జగన్ నివాళులర్పించనున్నారు.
అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.అయితే ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.
రేపు సాయంత్రం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.







