NTR Ram Charan : ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇద్దరు హీరోల మాట ఏంటి.. వారేమంటున్నారు!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఈ ఏడాది ఆరంభం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరును సొంతం చేసుకుంది.ప్రముఖ అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఈ సినిమా గురించి గొప్పగా కథనాలు రాయడం తో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కినంత గౌరవం లభించింది అంటూ ప్రముఖులు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం జరిగింది.ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగం గా అమెరికా లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

 Rrr Movie Part 2 Movie Ram Charan And Ntr Comments , Ntr, Ntr And Ram Charan,raj-TeluguStop.com

ఆస్కార్ లో నామినేషన్స్ ను దక్కించుకునేందుకు రాజమౌళి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సమయం లోనే సీక్వెల్ ఉంది.మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అంటూ రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు.

Telugu Ntr Ram Charan, Rajamouli, Ram Charan, Rrr, Telugu-Movie

దాంతో సీక్వెల్‌ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో హీరోలు ఇద్దరు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాజిటివ్ గా స్పందించారు.రాజమౌళి సినిమా లో నటించడం అనేది ఒక అదృష్టం గా భావిస్తూ ఉంటాం… అలాంటిది ఒక సూపర్ హిట్ సినిమా యొక్క సీక్వెల్‌ లో నటించే అవకాశం వస్తే కాదంటామా అన్నట్లుగా ఎన్టీఆర్ సన్నిహితుల వద్దన్నాడట.

ఇక రామ్ చరణ్ కూడా తప్పకుండా జక్కన్న సినిమా లో నటించాలని అనుకుంటాను… మళ్లీ మళ్లీ ఆయన దర్శకత్వం లో పని చేయాలని అనుకుంటాను.తప్పకుండా నటిస్తాను అన్నాడు.

మొత్తానికి ఇద్దరు హీరోలు కూడా సీక్వెల్‌ విషయం లో పాజిటివ్ గా ఉన్నారు.కనుక మహేష్ బాబు తో సినిమా కంటే ముందు ఈ సినిమా ను పూర్తి చేస్తే బాగుంటుందని సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారట.

మరి రాజమౌళి ఆలోచన ఏంటో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube