ఈ రోజుల్లో ధరలతో సంబంధం లేకుండా అన్ని కార్లలో కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.వాటిలో సన్‌రూఫ్ ఒకటి.
ఈ సన్‌రూఫ్ ఓపెన్ చేస్తే చాలా అద్భుతమైన అనుభూతి లభిస్తుంది.ముఖ్యంగా తగినంత గాలి, వెలుతురు అందుతుంది.
అయితే కొందరు ఈ సన్‌రూఫ్ ఓపెన్ చేసి నిలబడుతుంటారు.ఇలా చేయడం వల్ల పెద్దగా ప్రమాదం లేదని భావిస్తుంటారు.
ఇలా చేయడం ఎంత డేంజరో తాజాగా ఒక వీడియో చెప్పకనే చెబుతోంది.
ఈ వీడియోలో సన్‌రూఫ్ ఫీచర్ గల ఒక కారు కనిపించింది.
కాగా ఇద్దరు యువకులు ఆ సన్‌రూఫ్ నుంచి తల పైకి పెట్టి నిల్చున్నారు.ఈ కారు కియా కార్నివాల్ కారు అని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే సన్‌రూఫ్ నుంచి ఆ వ్యక్తులు బయట వచ్చినప్పుడే డ్రైవర్ సడన్‌గా చాలా హార్డ్ గా బ్రేక్ వేశాడు.ఒక్కసారిగా కారు ఆగిపోవడంతో నిలబడి ఉన్న వ్యక్తులు ముందుకు పడ్డారు.
దాంతో వారి ముక్కులు కారు పైభాగానికి బలంగా గుద్దుకున్నాయి.క్షణకాలంలో జరిగిన ఈ ఘటనతో వారికి గట్టిగానే దెబ్బలు తగిలినట్లు తెలిసింది.

ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే నిల్చునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇండియన్ రోడ్లపై ఎప్పుడు ఏవి అడ్డు వస్తాయో మనం చెప్పలేం.డ్రైవర్లు ఎప్పుడు సడన్ బ్రేక్ వేస్తారో కూడా ఊహించలేం.అందువల్ల నిల్చునేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు కూడా సలహా ఇస్తున్నారు.కారు అత్యంత వేగంగా వెళుతూ ఉంటే మరింత డేంజర్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







