Multi Vitamin Drink : రోజు మార్నింగ్ ఈ మల్టీ విటమిన్ డ్రింక్ తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని పోషక విలువలు మన శరీరానికి అందేలా చూసుకోవాలి.అది మన బాధ్యత.

 Drinking This Multi Vitamin Drink In The Morning Is Very Good For Your Health! M-TeluguStop.com

కానీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఈ విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు.ఫలితంగా జబ్బుల బారిన పడుతుంటారు.

అయితే అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే మల్టీ విటమిన్ డ్రింక్ ను మీరు తీసుకోవాల్సిందే.ఈ మల్టీ విటమిన్ డ్రింక్ రోజు మార్నింగ్ తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

పైగా ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడం చాలా సులభం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మల్టీ విటమిన్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక యాపిల్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర కప్పు పైనాపిల్ ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి.

రెండు ఉసిరి కాయలు నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే గింజలు తొలగించి ముక్కలుగా కట్ చేయాలి.మరియు ఒక చిన్న క్యారెట్ ను కూడా తీసుకుని పీల్ తొలగించి స్పైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు పచ్చి పసుపు కొమ్ము స్పైసెస్, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యోస్‌ను సపరేట్ చేసుకుంటే మన మల్టీ విట‌మిన్ డ్రింక్ సిద్దమవుతుంది.

Telugu Foods, Tips, Healthy, Latest, Multi Vitamin-Telugu Health Tips

ఈ డ్రింక్‌లో చిటికెడు మిరియాల పొడిని కలిపి సేవించాలి.ప్రతిరోజు ఈ మల్టీ విటమిన్ డ్రింక్ ను తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.

వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది మరియు హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube