Rj Surya Bigg Boss 6 : ప్రేమకు కండిషన్స్ పెట్టారు.. ప్రేమించిన అమ్మాయి కోసం సూసైడ్ అటెంప్ట్ చేశా: ఆర్జె సూర్య

తెలుగు ప్రేక్షకులకు ఆర్జే సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీ ఏర్పరచుకున్నాడు ఆర్జే సూర్య.

 Rj Surya Breakup Love Story , Rj Surya, Bigg Boss Season 6, Breakup Love Story,-TeluguStop.com

తన వాయిస్ తో హీరోల వాయిస్ ని మిమిక్రీ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.లాగా ప్రస్తుతం తెలుగులో ప్రసారమవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ షోలో ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.కానీ సూర్య ఎక్కువ రోజులు అవసరం నిలబడలేకపోయాడు.

ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూలో భాగంగా సూర్య మాట్లాడుతూ.మా అమ్మ బీడీలు చుట్టేది.నాన్న తాపీ పని చేసేవాడు.నాన్న పనికి వెళ్తేనే మాకు పూట గడిచేది.

ఒకరోజు కూడా మా నాన్న సెలవు తీసుకునేవాడు కాదు.వాళ్లే నా ఇన్స్పిరేషన్.

నేను స్కూల్లో ఉన్నప్పుడు పాన్ షాప్ లో సోడా బాటిల్లు క్లీన్ చేసేవాడిని.అప్పుడు రోజుకు 10 రూపాయలు ఇచ్చేవారు.అది నా మొదటి జీతం.అలా పీజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను ప్రపోస్ కూడా చేశాను అందుకు ఆమె ఒప్పుకుంది.ఇద్దరము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.ఇంట్లో ఒప్పుకోక పోయి తరికి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాము.

అప్పుడు అమ్మ వచ్చి అమ్మాయి వాళ్ళతో మాట్లాడింది.అప్పుడు వాళ్లు చదువు అయిపోయే వరకు మీరిద్దరూ ఫోన్ మాట్లాడుకోకూడదు కలుసుకోకూడదు అని కండిషన్ పెట్టారు.

Telugu Love, Rj Surya, Attempt-Movie

చదువు అయిపోయిన తర్వాత కూడా మీ మధ్య ఇదే ప్రేమ ఉంటే పెళ్లి చేస్తామని అన్నారు.అందుకు మేము కూడా సరే అన్నాము.అలా రెండు నెలలు గడిచిపోయాయి.ఇక ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో ఒక అమ్మాయి ఫోన్ చేసి మీ అమ్మ గారువచ్చినప్పుడు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు.

మీ నాన్న అసలు రానేలేదు.నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే మీ పేరెంట్స్ ని వదిలేసి మా ఇంటికి వచ్చేసే మాతో ఉండిపో అని ఆమె చెప్పింది.

అప్పుడు ఏం చేయాలో తెలియక ఫోన్ పగలగొట్టేసాను.అప్పుడు ఇంటి తలుపులు మూసి అమ్మ కాళ్ళ మీద పడి తప్పైపోయింది అమ్మ అంటూ మూడు గంటల పాటు వెక్కివెక్కి ఏడ్చాను.

నన్ను గుండెల మీద పెంచిన వాళ్ళు గుండెల మీద తన్నాను.అమ్మ అయినా వెంటనే క్షమించేసింది.మరుసటి రోజు చెన్నై రెడ్ ఎఫ్ఎం నుంచి ఫోన్ వచ్చింది.హైదరాబాదులో కోచింగ్ ఇవ్వడంతో చదువు మానేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను.

ఆ తర్వాత ఆర్జె సూర్య గా, యాంకర్ గా, షార్ట్ ఫిలిమ్స్ లో నటుడిగా రాణించాను అని చెప్పుకొచ్చాడు సూర్య

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube