పవన్ కళ్యాణ్ ఏపీలో జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని భావించిన విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఆ మధ్య వరుసగా సినిమా లకు కమిట్ అయి అందులో రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.అందులో క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా ఒకటి.
ఇది కాకుండా హరిష్ శంకర్ దర్శకత్వం లో ఒకటి.ఇంకా పలువురు దర్శకులతో కలిసి మరి కొన్ని సినిమా లో పవన్ కళ్యాణ్ నటించేందుకు ప్లాన్ చేశాడు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి రాజకీయం గా ఇది అత్యంత కీలకమైన సమయం.ఈ సమయం లో సినిమాలు అంటూ ఎక్కువ సమయం ఇండస్ట్రీ కోసం కేటాయిస్తే రాజకీయాల్లో తాను చాలా నష్ట పోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ భావించాడట.
అందుకే ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయిన హరిహర వీరమల్లు సినిమా కాకుండా ఇతర కమిట్ అయిన సినిమాలన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఇంకో 15 నుండి 20 రోజుల డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.
దాంతో సినిమా మొత్తం పూర్తి అవుతుంది.ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెడతాడట.

పవన్ కళ్యాణ్ తో సినిమా లు చేయాలనుకున్న దర్శకులు ఇప్పటికే వేరే ప్రాజెక్ట్స్ వెతుక్కుంటున్నారు.పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మళ్లీ సినిమాల జోలికి వెళ్లక పోవచ్చు అని.అందుకే ఆ దర్శకులు మరో ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు సిద్ధం అవ్వడమే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.హరిహర వీరమల్లు సినిమా లో వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమా లకు దూరమవ్వడం ను ఆయన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.







