బాలీవుడ్ నటి,రాజ్యసభ ఎంపీ జయ బచ్చన్ ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఫోటోగ్రాఫర్లపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగుకు గురయ్యారు.
అదేవిధంగా పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం తప్పేమీ కాదంటూ మరోసారి సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే తాజాగా ఈమె తన మనవరాలు నవ్య నవేలి ఫోడ్ కాస్ట్ ఎపిసోడ్ కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె గతంలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ తాము హీరోయిన్ గా పనిచేసే సమయంలో హీరోయిన్ లకు ప్రత్యేకించి ఇలాంటి క్యారవాన్ సౌకర్యాలు ఉండేటివి కాదు.
అప్పట్లో ఎంతో కష్టపడి షూటింగులకు హాజరు కావాల్సి వచ్చేదని ఈమె తెలిపారు.ఇక ఔట్ డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు పీరియడ్స్ సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారమని ఈ సందర్భంగా జయ బచ్చన్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
పీరియడ్స్ సమయంలో సానిటరీ ప్యాడ్ మార్చుకోవడం కోసం పొదుల చాటుకు వెళ్లాల్సి వచ్చేదని ఈమె తెలిపారు.

ఇలా పొదల చాటున వెళ్లి సానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించేది ఈమె తెలియజేశారు.అందుకే మహిళలకు ఆ ఐదు రోజులపాటు కాస్త విశ్రాంతి కల్పించాలని మహిళలు పనిచేసే ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు పురుషులు వీటిని అర్థం చేసుకొని వారికి వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా ఈమె కోరారు.ఇక ప్రస్తుతం అయితే ఒక్కో హీరోయిన్ కి కేరవాన్ సౌకర్యం ఉండటం వల్ల అవుట్ డోర్ షూటింగ్ కూడా పెద్దగా ఇబ్బందికరంగా లేదు కానీ అప్పట్లో చాలా ఇబ్బందులు తలెత్తేవి అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







