మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కి ఊహించని కౌంటర్ ఇచ్చారు.విషయంలోకి వెళ్తే T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. సెటైర్లు వేశారు.
ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ లు.టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.గత వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ రెండు మ్యాచ్ లు పోలుస్తూ ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని షరీఫ్ వేసిన సెటైర్లకు.ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.“పాకిస్తాన్ కి ఇండియాకి ఉన్న తేడా ఇదే.మేము మా పట్ల ఆనందంగా ఉన్నాం.కానీ మీరు పొరుగు వారి బాధల్లో కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.
ఇందువల్లే మీ దేశం పట్ల మరియు మీ ప్రజల బాగోగుల పట్ల సరిగ్గా మీరు దృష్టి పెట్టలేకపోతున్నారు” అంటూ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇర్ఫాన్ పటాన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







