తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఆరవ సీజన్ ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకుని పదవ వారం కూడా పూర్తి కానుంది.21 మంది కంటెస్టెంట్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి 9 మంది ఎలిమినేట్ అయ్యారు.ఇక పదవ వారం ఎలిమినేషన్ గురించి పెద్ద ఎత్తున ఆత్రుత ఏర్పడింది.గత రెండు వారాల నుంచి ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు హౌస్ నుంచి వెళ్లడంతో ఈవారం ఎలిమినేషన్ పై కూడా ఉత్కంఠ ఏర్పడింది అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళనున్నారనే విషయానికి వస్తే…
పదో వారం నామినేషన్స్ లో ఉన్నటువంటి వారిలో మెరీనా దంపతులు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తున్నట్టు సమాచారం.
ఆదివారం జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్స్ శనివారం పూర్తి కావడంతో ప్రతి శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో తెలిసిపోతుంది.ఇప్పటివరకు ఎలిమినేషన్ కి ముందు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వారే ఎలిమినేట్ కావడం విశేషం.
ఈ క్రమంలోనే ఈ వారం మెరీనా రోహిత్ దంపతులు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నట్లు సమాచారం.

ఇక ఈ వారం ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఈ జంట పదవ వారం ఎలిమినేట్ కానున్నారు.ఇకపోతే వీరిద్దరిని వేరువేరుగా కాకుండా ఒకే కంటెస్టెంట్ గా చూడమని ఈ కార్యక్రమం మొదట్లోనే బిగ్ బాస్ సూచించారు.వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయినా ఇద్దరు బయటకు వెళ్లాల్సిందేనని చెప్పడంతో పదవ వారంలో భాగంగా మెరీనా రోహిత్ బిగ్ బాస్ హౌస్ వీడనున్నట్లు సమాచారం.
మరి బిగ్ బాస్ ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.







