సినిమా రంగంలో సక్సెస్ ఫెయిల్యూర్ ఓవర్ నైట్ లో జీవితాలను తలక్రిందులు చేస్తుంది.బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలలో కొంతమంది హీరోలు సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగించినా ఎక్కువమంది హీరోలు మాత్రం మాత్రం వరుస ఫ్లాపుల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.
పాన్ ఇండియా డైరెక్టర్ గా పాపులారిటీని సంపాదించుకున్న సుకుమార్ గతంలో విజయ్ దేవరకొండతో ఒక సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటించారు.
విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని బోగట్టా.లైగర్ డిజాస్టర్ రిజల్ట్ విజయ్ దేవరకొండ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతో విజయ్ తో సినిమాను తెరకెక్కించి రిస్క్ తీసుకోవడానికి సుకుమార్ ఇష్టపడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఒక్క ఫ్లాప్ విజయ్ దేవరకొండ కు కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది.
ప్రస్తుతం టైర్1 హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తున్న సుకుమార్ రాబోయే రోజుల్లో కూడా ఆ హీరోలతోనే సినిమాలను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
సుకుమార్ విజయ్ దేవరకొండను ఇగ్నోర్ చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి విజయ్ ప్రాజెక్ట్ ను సుకుమార్ హోల్డ్ లో పెట్టారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి పని చేయాలని చాలామంది యంగ్ జనరేషన్ డైరెక్టర్లు భావిస్తుండటం గమనార్హం.అయితే విజయ్ మొదట ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.సుకుమార్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం వల్ల కూడా భారీ హీరోలతోనే సినిమాలు తీయాలని సుకుమార్ ఫిక్స్ కావడానికి కారణమని బోగట్టా.సుకుమార్ పుష్ప2 తర్వాత రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించనున్నారు.
వైరల్ అవుతున్న వార్తలపై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







