విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.కొద్ది నెలల క్రితం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది.
ఇప్పుడు మరోసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగింది అని తెలిపారు.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఏపీ ప్రజలు తమ ప్రతిభను చాటుతారు.వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారు.
ఏపీ ప్రాంతాలకు చెందిన వెంకయ్య నాయుడు మరియు హరిబాబు తనతో ఎప్పుడూ భేటీ అయినా గాని ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడతారని ప్రధాని మోడీ గుర్తు చేశారు.అభివృద్ధిలో దేశం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
రైల్వే మరియు రోడ్లు ఇంకా పోర్టుల అభివృద్ధిలో ఎప్పుడూ కూడా సందేహించలేదు.విశాఖ రైల్వే స్టేషన్, పోర్టును ఆధునికరిస్తున్నాం.
బహుముఖ రవాణా దిశగా విశాఖ ముందుకు వెళుతుంది.సామాన్యుడి జీవితం మెరుగుపరచడమే తమ లక్ష్యం.
ఈ క్రమంలో పేదల కోసం పథకాలు కొనసాగిస్తామని ప్రధాని మోడీ విశాఖ సభలో తెలియజేయడం జరిగింది.