Room Heaters: రూమ్ హీటర్లు వాడుతున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్త వహించండి!

చలి కాలంలో వున్న ప్రధాన సమస్యలు గురించి అందరికీ తెలిసినదే.ఒక్కోచోట అయితే చలిని తట్టుకోలేక ముఖ్యంగా వృద్ధులు మరణించిన ఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం.

 Follow These Tips While Using Room Heaters Details, Room Heaters, Alert, Techno-TeluguStop.com

ఈ క్రమంలోనే రూమ్ హీటర్లకి మంచి డిమాండ్ ఏర్పడింది.పట్టణాల్లో వీటి వాడకం ఇపుడు సర్వసాధారణం అయిపోయింది.

చలిని తట్టుకునేందుకు జర్కిన్లు, గ్లౌవ్స్‌, క్యాప్‌లను ఎలా అయితే వాడుతున్నారో అత్యంత చల్లటి వాతావరణంలో ఉండే వారు ఖచ్చితంగా హీటర్లను వాడాల్సిన పరిస్థితి వుంది.

ఈ హీటర్లు అనేవి గదిలో కృత్రిమంగా వేడి వాతావరణాన్ని సృష్టిస్తాయి.

తద్వారా చలి మనిషిని బాధించవు.అయితే ఈ హీటర్లను ఇంకా అలాగే బ్లోయర్‌ల వల్ల ఇన్‌స్టాంట్‌గా లాభం కలిగినప్పటికీ, వాటి వల్ల దీర్ఘ కాలంలో ఆరోగ్యం దెబ్బతింటుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గంటల తరబడి హీటర్లు ఉన్న గదుల్లో గడిపితే ఖచ్చితంగా పలు అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.అలాగే హీటర్ లేదా బ్లోవర్ ఉన్న గది డోర్‌ను గంటల తరబడి మూసి ఉంచడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్ క్యాత్ నోక్స్ తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

Telugu Cool, Heart Attack, Hot Temperature, Latest, Heater, Heater Effects, Heat

ఇంకా ఆయన మాట్లాడుతూ రూమ్ హీటర్‌లు వాడటం వలన దీర్ఘకాలంలో గుండె పోటు వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.ఇక ఈ సమస్యకు మీరు చెక్‌ పెట్టాలంటే గదిలో హీటర్‌ను ఉపయోగిస్తే కచ్చితంగా విండోస్‌ ఓపెన్ చేసి తీరాలని సూచిస్తున్నారు.దీని ద్వారా సరైన వెంటిటేషన్‌ అనేది మీకు ఉంటుందని, గది ఉష్ణోగ్రత తద్వారా బ్యాలెన్స్‌ అవుతుందని చెబుతున్నారు.హీటర్లు ఉన్న గదిలో గంటల తరబడి ఉంటే చికెన్ పాక్స్ ఇంకా అలాగే టీబీ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కాబట్టి జాగ్రత్త మిత్రులుగా!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube