టాలీవుడ్ కమెడియన్ అలీ ఇంట అప్పుడే పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.అలీ తన కూతురు పెళ్లి సందర్భంగా ప్రస్తుతం పెళ్లి పత్రికలు పంచే పనిలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
కాగా అలీ, జుబేదా అలీ దంపతుల కుమార్తె అయిన ఫాతిమా నిశ్చితార్థ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు అలాగే పలువురు సన్నిహితులు స్నేహితులు సినీ ప్రముఖులు సైతం హాజరైన విషయం తెలిసిందే.
అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఆలీ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులను వివాహానికి ఆహ్వానించే పనిలో పడ్డారు.
ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులను అలాగే సినీ ప్రముఖులను కలిసి వారికి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి జగన్ ని పెళ్లికి ఆహ్వానించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆలీ తన కూతురి పెళ్ళికి ఇన్వైట్ చేయడం కోసం మెగాస్టార్ ఇంటికి సతి సమేతంగా వెళ్లారు.
చిరంజీవిని కలిసి అనంతరం ఇద్దరు కలిసి పెళ్లి పత్రికను ఇచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానించారు.చిరంజీవితో కలిసి దిగిన ఫోటోని అలీ సతీమణి జుబేదా అలీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే కమిడియన్ అలీ విషయానికి వస్తే ఇప్పటికే కొన్ని వందల సినిమాలను నటించి కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు అలీ.అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్లలో అలీ కూడా ఒకరు.ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఈటీవీలో ఒకసారి అలీతో సరదాగా షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు అలీ.







