టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు నిజమైన లీడర్ అయితే వంగవీటి రంగా హత్య కేసుతో సంబంధం లేదని చెప్పాలన్నారు.
విజయవాడకు వచ్చి తన తప్పు లేదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.కాపులను చెల్లా చెదురు చేయడానికి వంగవీటి రంగాను హత్య చేశారని ఆరోపించారు.
ఆనాడు బీసీల తోక కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారని తెలిపారు.వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.







